: కాంగ్రెస్ కష్టకాలంలో ఉంది: దిగ్విజయ్ సింగ్


తెలంగాణ ఇచ్చినా కూడా 'రెండింటికీ చెడ్డ రేవడి'లా మారింది కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడీ విషయం ఆ పార్టీ ఢిల్లీ నేతలకు కూడా బాగానే తెలిసినట్టుంది. ఈ క్రమంలో రెండు రోజుల నుంచి హైదరాబాదులో తిష్ఠ వేసిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ గాంధీభవన్ లో మాట్లాడుతూ, ప్రస్తుతం కాంగ్రెస్ కష్టకాలంలో ఉందన్నారు. రెండు పీసీసీల ఏర్పాటుతో కొత్త అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఈ సమయంలో కాంగ్రెస్ బలోపేతంతో పాటు ఇరు ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని పీసీసీ అధ్యక్షులకు సూచించారు.

  • Loading...

More Telugu News