: రాత్రంతా కామదహనం


రంగుల పండుగ హోలీకి రెండు రోజుల ముందు కాముడ్ని దహనం చేయటం తెలంగాణ ప్రాంతంలో రివాజు. ఈ క్రతువులో భాగంగా తెలంగాణ జిల్లాలతో పాటు  జంటనగరాల్లోని కొన్ని ప్రాంతాలలో కాముడి దహన కార్యక్రమం రాత్రి కోలాహలంగా జరిగింది. దక్షిణ కాశీగా పేరొందిన కరీంనగర్ జిల్లా వేములవాడలో కామదహనం వేడుక అంగరంగవైభవంగా సాగింది. 

ఈ సందర్భంగా,  స్థానిక పార్వతి, రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో డోలోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులు.. పార్వతి, రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వార్లను ఊయలలో కూర్చోబెట్టి ఊరేగించారు. 

  • Loading...

More Telugu News