: గాలింపు చర్యల్లో 13 దేశాలు
అంతు చిక్కని రీతిలో తప్పిపోయిన మలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం కోసం గాలింపు చర్యలు ముమ్మరం అయ్యాయి. ఏకంగా 13 దేశాలు సెర్చ్ ఆపరేషన్ లో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో మన దేశం కూడా ఉంది. గాలింపు ప్రక్రియ బంగాళాఖాతం, అండమాన్ దీవుల వరకు విస్తరించింది. అయితే ఇప్పటి వరకు ఫ్లయిట్ మిస్సింగ్ కు సంబంధించి ఎలాంటి చిన్న క్లూ కూడా దొరకలేదు.