: హైజాక్ కు గురైన మలేషియా విమానం
కొద్ది రోజుల క్రితం అనుమానాస్పదంగా మాయమైన మలేషియన్ ఎయిలైన్స్ విమానం విషయంలో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ విమానం హైజాక్ కు గురైందని మలేషియన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు వారు ఓ నివేదికను అందజేశారు. విమానంలో ప్రయాణికుల మాదిరిగా హైజాకర్లు ప్రవేశించారని తెలిపారు. హైజాకర్లలో ఒకరిద్దరికి విమానం నడపడంలో అనుభవం ఉందని వెల్లడించారు. విమానంలోని సిగ్నలింగ్ (రాడార్) వ్యవస్థను వీరు కట్ చేశారని... అందువల్లే విమానానికి గ్రౌండ్ కంట్రోల్ తో సంబంధాలు తెగిపోయాయని తెలిపారు. పైలట్ కూడా హైజాక్ చేసి ఉండవచ్చనే అనుమానాలను కూడా వ్యక్తపరిచారు. విమానంలో ముగ్గురు వ్యక్తులు నకిలీ పాస్ పోర్టులతో ప్రయాణించారని చెప్పారు.