: పాతకారుకు పది కోట్లు
'ఓల్డ్ ఈజ్ గోల్డ్' సామెత తెలుసుగా.. ఎంత పాతదైతే అంత అమూల్యం. సాధారణంగా పాత మద్యానికి చాలా ఖరీదు ఉంటుంది. ఎందుకంటే పాతబడితే మద్యం రుచి పెరుగుతుందని దానికంత డిమాండ్. ఇప్పుడు ఓ వందేళ్ల క్రితం నాటి కారు కూడా కొత్తగా ముస్తాబై నన్ను కొనగలరా.? అంటూ వేలానికి వచ్చింది.
అయితే దీని ధర తెలుసుకోవాలంటే ధైర్యం ఉండాలి మరి. కేవలం 60 హెచ్ పీ సామర్థ్యం, చెక్క అల్యూమినియం, స్టీలుతో 108 ఏళ్ల క్రితం తయారైన ఫియట్ కారు ఇది. దీని ప్రత్యేకత ఏంటంటారా? పది కోట్ల రూపాయలు. అవును దీని వేలం ధరే దీని ప్రత్యేకత. 25న ఇటలీలో దీనిని వేలానికి పెడుతున్నారు. వీలుంటే ఖుషీ సినిమాలోలా.. బస్తాలలో నోట్ల కట్టలు నింపుకుని ఇటలీ విమానం ఎక్కేయండి.