: 'కాంగ్రెస్ హఠావో... దేశ్ భచావో' నినాదంతో ప్రసంగం ముగించిన పవన్
పవన్ కల్యాణ్ తన జన సేన పార్టీని అధికారికంగా ప్రకటించారు. ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తూ 'కాంగ్రెస్ హఠావో... దేశ్ భచావో' అంటూ నినాదం చేశారు. అంతకుముందు, కాంగ్రెస్ హైకమాండ్ పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. షిండే, మొయిలీ, షిండే, ఆంటోనీ, అహ్మద్ పటేల్ తదితరులు కలసి రాష్ట్రాన్ని విభజించిన తీరు ప్రజలను తీవ్రంగా గాయపరిచిందని చెప్పారు.