: శ్రీకాంతాచారి తల్లి వేదన కన్నీరు తెప్పించింది: పవన్ కల్యాణ్
తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. విడిపోయిన తర్వాత తెలుగువారి మధ్య చిచ్చు పెట్టొద్దని తెలంగాణ రాజకీయ నేతలకు ఆయన హితవు పలికారు. తెలంగాణ ఉద్యమం కోసం వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం బాధ కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇటీవల తెలంగాణ ప్రకటించిన తరువాత శ్రీకాంతాచారి తల్లి వేదన తనకు కన్నీరు తెప్పించిందని పవన్ కల్యాణ్ చెప్పారు.