: అధికారం, డబ్బు సంతృప్తి ఇవ్వవు, ప్రజాసేవ ముఖ్యం: పవన్ కల్యాణ్


సీమాంధ్ర ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో తనను సీమాంధ్ర నేతలు ఉద్యమానికి సారథ్యం వహించమని అడిగారని పవన్ కల్యాణ్ అన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తే భవిష్యత్తులో సీమాంధ్రకు ముఖ్యమంత్రి కావచ్చునని వారు తనకు సలహా కూడా ఇచ్చారని పవన్ సభాముఖంగా చెప్పారు. కానీ, తనకు తెలంగాణ, సీమాంధ్ర అంటూ బేధం లేదని, తెలుగువారంటే తనకు అభిమానమని ఆయన స్పష్టం చేశారు. ఆ సమయంలో జగన్ జైల్లో ఉన్నారని, చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం లేదని వారు తనతో అన్నారని పవన్ చెప్పుకొచ్చారు. కానీ తనకు... అధికారం, డబ్బు సంతృప్తి ఇవ్వవని, ప్రజాసేవ ముఖ్యమని పవన్ తేల్చి చెప్పారు.

  • Loading...

More Telugu News