: కొమరం భీమ్ చిత్రాన్ని టీ షర్టుపై పెట్టుకోవడం తప్పా?: పవన్
ఎక్కడో దక్షిణ అమెరికాలో జన్మించిన విప్లవ వీరుడు చే గువేరా చిత్రం ఉన్న టీ షర్టును ధరించగలనని , కానీ, తెలంగాణలో పుట్టిన కొమరం భీమ్ చిత్రం ఉన్న టీ షర్టు ధరించలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్. కొమురం భీమ్ వంటి వీరుడికి ప్రాంతీయతత్వం ఆపాదించడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.