: బట్టలూడదీసి కొడతానంది ఇందుకే: పవన్


గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలను బట్టలూడదీసి కొట్టాలని తాను పిలుపునివ్వడానికి గల కారణాన్ని పవన్ కల్యాణ్ వెల్లడించారు. అదేమిటో ఆయన మాటల్లోనే... 'హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు గాంధీభవన్ వద్ద భీమ్ రావ్ వాడ అని ఓ బస్తీ ఉంది. ఆ ప్రజలను అక్కడ నుంచి ఖాళీ చేయించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. అందుకు ప్రభుత్వ అధికారులను పురమాయించారు. ప్రజల అభివృద్ధి కోసం వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడంలేదని, కాంగ్రెస్ పార్టీ ఆఫీసును విస్తరించేందుకే వారిని అక్కడి నుంచి తరలిస్తున్నారని అర్థమైంది. ఆ సమయంలో నేను భీమ్ రావ్ వాడ వెళితే ఓ తల్లి ఏడుపు నన్ను కదిలించింది. కొత్త ప్రదేశంలో తన వయసుకొచ్చిన కూతురిని ఎలా కాపాడుకోవాలో అర్థం కావడంలేదని ఆమె భోరున ఏడ్చింది. ఇలాంటి వారిని బాధపెడుతున్నందుకే తిట్టాను కాంగ్రెస్ నాయకులను పంచలూడదీసి కొట్టాలని' అని వెల్లడించారు.

  • Loading...

More Telugu News