: ఆ ఊరంతా షాక్ కొడుతోంది
అవును.. ఈ ఉదయం నుంచీ ఆ ఊరంతా విద్యుదాఘాతమయమైంది. మెదక్ జిల్లా గజ్వేల్ మండలం బేజుగాం గ్రామంలో ఏ ఇంటిలోని విద్యుత్తు ఉపకరణాలు పట్టుకున్నా అవి షాక్ కొడుతున్నాయి. ఈ క్రమంలో మహేష్ గౌడ్ అనే 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి పంపుసెట్ ఆన్ చేస్తూ షాక్ కు గురై మరణించాడు. దీంతో గ్రామ ప్రజలు భీతావహులై విద్యుత్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో గ్రామానికి విద్యుత్తు సరఫరా నిలిపివేసి విద్యుత్తు శాఖ సిబ్బంది కారణాలను అన్వేషిస్తున్నారు.