: సచిన్ తో పోల్చి నన్ను విమర్శించేవారు: పవన్


పవన్ కల్యాణ్ సినీ రంగంలోకి రాకముందు తన జీవితంలో జరిగిన కొన్ని అంశాలను అభిమానులతో పంచుకున్నారు. తాను పనీపాటా లేకుండా తిరగడం చూసిన కుటుంబ సభ్యులు క్రికెట్ దేవుడు సచిన్ తో పోల్చి విమర్శించేవారని వెల్లడించారు. 'సచిన్ చూడు ఎలా ఆడుతున్నాడో, నువ్వెప్పుడు ప్రయోజకుడివి అవుతావు?' అని వారు అంటుంటే తనకు బాధ కలిగేదని, అయితే ఏదో సాధించాలని గుండెల్లో ఉన్నా, అందుకు తగ్గ నైపుణ్యాలు అప్పట్లో లేవని చెప్పారు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, బాధ ఇలాగైనా తీరుతుందేమోనని సహచరులతో విపరీతంగా కొట్టించుకునేవాడినని అయినా అది తీరని వేదనలానే మిగిలిపోయిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News