: బోర్డు చూసి హోటల్ శుభ్రత తెలుసుకోవచ్చు


మీ వీధిలో టిఫిన్ సెంటర్లు, బండ్లు ఎన్నో ఉంటాయి. రుచి బావున్న చోటే మీరు టిఫిన్ కానిచ్చేస్తుంటారు. కానీ, రుచికాదు కదా ముఖ్యం! రుచి కంటే పరిశుభ్రతే చాలా ముఖ్యం. మరి అక్కడ ఎంత పరిశుభ్రంగా చేస్తున్నారో మీరు ప్రత్యేకంగా పరిశీలించే ఇబ్బంది లేకుండానే ఆ హోటల్ కు ఇచ్చిన రేటింగ్ ను చూసి తెలుసుకోవచ్చు. 

భారతీయ ఆహార భద్రతా, ప్రమాణాల సంస్థ కొత్త నిబంధనలను రూపొందిస్తోంది. మరికొన్ని నెలల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఈ నూతన నిబంధనలు అమలులోకి వస్తే ప్రతీ హోటల్, స్వీట్ షాప్, బేకరీ ఇలా ఆహార పదార్థాలను విక్రయించే అన్ని షాపులూ, హోటళ్లూ, రెస్టారెంట్లు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలి. 

కచ్చితంగా పరిశుభ్రమైన వాతావరణం, పరిసరాల మధ్య, రక్షణ తొడుగులతోనే పదార్థాలను తయారు చేయాల్సి ఉంటుంది. వీరు పాటించే శుభ్రత ఆధారంగానే రేటింగ్ ఇస్తారు. లెవల్-1 ఉంటే అక్కడ ఆహార పదార్థాలు నిబంధనలకు అనుగుణంగానే తయారు చేసినట్లు లెక్క. ఈ సారి వీధి వర్తకులకు (బండ్లపై, పుట్ పాత్ లపై అమ్మేవారు) కూడా ఆహార పదార్థాల తయారీ, విక్రయం విషయంలో నిబంధనలు అమలులోకి రానున్నాయి.  

ప్రతి ఒక్క సంస్థ ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవడానికి గడువు 2014 ఫిబ్రవరి వరకూ ఇచ్చారు. అప్పటికీ నమోదు చేయించుకోని వర్తకులపై జరిమానాల బండ పడనుంది. 

  • Loading...

More Telugu News