: కేసీఆర్ మాటలను కేసీఆర్ కే అప్పగించిన పవన్
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైనా పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఇటీవల తనను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. అన్న దుకాణం బంద్ అయింది, రాజకీయాల్లోకి మరో సినీ వ్యక్తి వస్తున్నాడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఆవిర్భావ సభలో అచ్చు కేసీఆర్ స్టయిల్లోనే ఆయన మాటలను ఆయనకే అప్పగించారు పవన్.