: గుండెల నిండా ధైర్యం ఉందంటున్న పవన్
పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభమైంది. హైదరాబాదులోని మాదాపూర్ నోవాటెల్ హోటల్లో జరుగుతున్న ఈ సభలో ప్రస్తుతం పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. 'అందరికీ హృదయ పూర్వక నమస్కారం' అంటూ మొదలెట్టిన పవర్ స్టార్ తనకు ఏమీ లేకున్నా గుండె నిండా ధైర్యం ఉందంటూ ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. అంతేగాకుండా, చిన్ననాటి నుంచి తనకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ కవితలంటే ఇష్టమని, కష్టాల్లో ఉన్నప్పుడు ఓ కవితను స్మరించుకుంటానంటూ, ఇల్లేమో దూరం.. అంటూ తిలక్ కవితను చదివి అభిమానులను ఉత్తేజపరిచారు.