: వచ్చే ఎన్నికల్లో పోలింగ్ సమయం పెంపు
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అంగీకరించింది. ఇంతకు ముందు 9 గంటలుగా ఉన్న పోలింగ్ సమయాన్ని 11 గంటలకు పెంచారు. దీంతో, ఈ దఫా ఎన్నికల్లో పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.