: చిరు చేయలేనిది పవన్ చేస్తాడా?
కొత్త పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్ పై అభిమానులు భరోసా ఉంచుతున్నారు. చిరంజీవి సామాజిక న్యాయం పేరిట పార్టీ పెట్టి ఇప్పుడు సిద్ధాంతాలను విస్మరించారని పవన్ ఫ్యాన్స్ ఆరోపించారు. అయితే, రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న తమ అభిమాన హీరో... అన్న చిరంజీవి వల్ల కాని సామాజిక న్యాయాన్ని తప్పక సాధిస్తారని వారు ఘంటాపథంగా చెప్పారు. మరికాసేపట్లో హైదరాబాదులోని మాదాపూర్ నోవాటెల్ హోటల్లో పవన్ జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఆరంభం కానుంది.