: పవన్ కోసం ఎల్ఈడీ స్క్రీన్ల ముందు భారీ కోలాహలం
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కాసేపట్లో తన పార్టీని ఆవిర్భవించనున్న సంగతి తెలిసిందే. అందుకు హైదరాబాదులోని మాదాపూర్ నోవాటెల్ హోటల్ ను వేదికగా ఎంచుకోగా, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని పలు నగరాల్లో ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. తిరుపతి, విజయవాడ, విశాఖ, గుంటూరు వంటి ప్రధాన నగరాల్లో ఏర్పాటు చేసిన భారీ తెరల ముందు అప్పుడే అభిమానులు పోటెత్తారు. మరికాసేపట్లో హైదరాబాదులో పవన్ ప్రసంగం ప్రారంభం కానుండగా, ఆయన ఏం చెబుతాడోనని అందరిలోనూ ఉత్కంఠ పతాకస్థాయికి చేరింది.