: పవన్ పార్టీ పవర్ కోసం కాదు, ప్రశ్నించేందుకే!: అభిమానులు
పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై అభిమానులు స్పందించారు. మరికాసేపట్లో ఆవిర్భవించనున్న ఈ పార్టీ అధికారం కోసం స్థాపించలేదని, ప్రశ్నించడం కోసం స్థాపించిందని అభిమానులు ముక్తకంఠంతో నినదించారు. ప్రస్తుతం ఈ సభకు వేదికగా నిలిచిన హైదరాబాదు, మాదాపూర్ నోవాటెల్ హోటల్ జనసేన జెండాల రెపరెపలు, అభిమానగణం నినాదాలతో కోలాహలంగా మారింది.