: ముంబయిలో భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి
ముంబయిలోని వకోలా ప్రాంతంలో ఈ సాయంత్రం ఏడంతస్తుల ఖాళీ భవనం కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. భవనంలో ఎవరు లేకపోయినా దాని పక్కన ఉంటున్న వారిపై శిథిలాలు పడటంతో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తున్నారు. ఇంకా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగుతున్నాయి.