: నోవాటెల్ హోటల్ కు చేరుకున్న పవన్ కల్యాణ్


సినీ హీరో పవన్ కల్యాణ్ నోవాటెల్ హోటల్ కు కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. మరికాసేపట్లో ప్రారంభం కానున్న సభలో పవన్ కల్యాణ్ కొత్త పార్టీ ‘జన సేన’ విధి విధానాలను స్వయంగా ప్రకటించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు పవన్ కల్యాణ్ వేదిక పైకి వస్తారు. పవన్ కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా నోవాటెల్ కు పవన్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పవన్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. లక్షలాది మంది ప్రజలు పవన్ కొత్త పార్టీ ప్రకటనను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.

  • Loading...

More Telugu News