: బడ్జెట్ లోపాలమయం: కాగ్


రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లోపాలమయమని కాగ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాగ్ తన నివేదికను శాసనసభకు సమర్పించింది. బడ్జెట్ లో కేటాయింపులకు, ఖర్చులకు మధ్య పొంతన ఉండడం లేదని పేర్కొంది. వివిధ శాఖలకు కేటాయించిన నిధులు మిగిలిపోతున్నాయని తెలిపింది. కేటాయింపులు చేయకుండానే ఖర్చు చేస్తున్నారని, ఇది నియమాల ఉల్లంఘనేనని తేల్చిపారేసింది.

సామాజిక, ఆర్థిక పథకాల అమలులో నియంత్రణ లేకుండా పోయిందని తెలిపింది. తీసుకున్న అప్పు వివరాలు సక్రమంగా నమోదు చేయాలని సూచించింది. సాగునీటి పథకాలకు 49వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ప్రయోజనం శూన్యమని పేర్కొంది. విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్ వ్యయం ఇతర రాష్ట్రాల కన్నా తక్కువగా ఉందని వెల్లడించింది. 

  • Loading...

More Telugu News