: మోడీ వీసాపై మాట్లాడేందుకు జాన్ కెర్రీ నిరాకరణ


బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పేరును ప్రకటించినప్పటి నుంచీ మోడీ అమెరికా వీసా అంశం కూడా అత్యంత ప్రచారంలోకి వచ్చింది. ఇదే సమయంలో గతం కంటే మెరుగ్గా వీసాపై స్పందించిన అమెరికా, వీసా వ్యవహారాన్ని పరిశీలిస్తామని మాత్రమే చెప్పుకుంటూ వస్తోంది. అయితే, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి జాన్ కెర్రీ మాత్రం వీసా విషయంపై మాట్లాడేందుకు నిర్మొహమాటంగా తిరస్కరించారు. ప్రస్తుత సమయంలో వీసా అంశంపై తను కామెంట్ చేయనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే, అమెరికా, భారత్ మధ్య సంబంధాలు చాలా ప్రధానమైనవని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా, ప్రాంతీయ పరంగా భారత్ చాలా కీలకమని అన్నారు. అనేక ముఖ్య సమస్యలపై కలసి పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, భారత్ ను గౌరవిస్తామని కెర్రీ వివరించారు.

  • Loading...

More Telugu News