: ఫ్లెచర్ కు పదవీగండం లేనట్టే


టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్ కు ఇప్పట్లో పదవీగండం లేనట్టే. ఆయనపై తాము సంపూర్ణంగా విశ్వాసం ఉంచామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పారు. ఈ మేరకు నేడు చెన్నైలో జరిగిన బోర్డు కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పటేల్ వెల్లడించారు. వాస్తవానికి ఈ భేటీ ముంబయిలో జరగాల్సి ఉండగా, బోర్డు అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కంటి శుక్లాలకు ఆపరేషన్ చేయించుకున్న నేపథ్యంలో చెన్నైలో నిర్వహించారు.

భేటీ అనంతరం సంజయ్ పటేల్ మాట్లాడుతూ, తాము ఫ్లెచర్ కు అల్టిమేటం ఏమీ జారీచేయలేదని చెప్పారు. 2011 వరల్డ్ కప్ అనంతరం గ్యారీ కిర్ స్టెన్ తప్పుకోవడంతో ఫ్లెచర్ టీమిండియా కోచ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ తో ముగియనుంది.

  • Loading...

More Telugu News