: జనసేన సభకు ఉవ్వెత్తున ఎగిసిన అభిమాన కెరటం
హైదరాబాదులోని నోవాటెల్ లో జరుగుతున్న ‘జనసేన’ సభకు పవన్ కల్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు సభా ప్రాంగణానికి వెళ్లేందుకు బారులు తీరారు. సభా ప్రవేశానికి ప్రత్యేకించి బార్ కోడ్ లతో కూడిన ఆరు వేల పాసులను మంజూరు చేశారు. అయితే పాస్ లు కలిగి ఉన్న వారికే ప్రవేశం కల్పిస్తామని, నాలుగు వేల మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అంతకు ముందే ప్రకటించారు. అభిమానులను, వారి పాస్ లను తనిఖీ చేసి ఒక్కొక్కరినే సభా ప్రాంగణానికి పంపిస్తున్నారు. పోలీసులే కాకుండా వేదిక వద్ద 500 మంది బౌన్సర్లను కూడా నియమించిన సంగతి తెలిసిందే.