: పవన్ కల్యాణ్ పార్టీ విజయానికి అభిమానుల పూజలు
పవన్ కల్యాణ్ పార్టీ విజయం సాధించాలని అభిమానులు పూజలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ మూర్తి దేవాలయంలో జనసేన పార్టీ విజయవంతం కావాలని పూజలు చేశారు. పవన్ కల్యాణ్ అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ సారథ్యంలో అభిమానులు ర్యాలీగా శ్రీకాకుళం నుంచి అరసవెల్లి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు.