: కేంద్ర మంత్రిపై మోడీ మండిపాటు


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పై నిప్పులు చెరిగారు. ఆయనకు రాజ్యాంగ వ్యవస్థలంటే నమ్మకం లేనట్టుందని ఆరోపించారు. ఒడిశాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఇటీవలే మన విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లండన్ వెళ్ళారు. అక్కడ ఆయన ఓ తీవ్రమైన అంశంపై మాట్లాడడం నన్ను షాక్ కు గురిచేసింది. ఎన్నికల సంఘం తమ నోటికి సంకెళ్ళు వేస్తోందని, తమ స్వేచ్ఛను హరిస్తుందని పరాయిగడ్డపై ఆరోపించారాయన. అమెరికా వంటి దేశంలో అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరిగిన తర్వాత ఫలితాలు రావాలంటే ఎన్నో రోజులు వేచి చూడాలి. కానీ, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ లో ఎన్నికల సంఘం కౌంటింగ్ జరిగిన రోజే ఫలితాలు వెల్లడిస్తుంది. ఖుర్షీద్ ఇంత ఘనతర వ్యవస్థను ప్రశంసించాల్సింది పోయి, విమర్శించడం విస్తుగొలుపుతోంది. ఈసీతోపాటు సుప్రీంను కూడా ఆయన వదలడంలేదు' అని ఆరోపించారు.

అంతేగాకుండా, 'ప్రధాని గారూ, మీ మంత్రి వర్గ సహచరుడు రాజ్యాంగ వ్యవస్థల ప్రతిష్ఠను మసకబార్చేలా ప్రవర్తిస్తున్నారు' అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీపైనా వాగ్బాణాలు సంధించారు. ఐఎన్ సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎంతమాత్రం కాదని, ఐఎన్ సీ అంటే ఇండియన్ నెగ్లెక్టింగ్ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. వారి పనల్లా రాజ్యాంగ వ్యవస్థలను దూషించడమేనన్నారు.

  • Loading...

More Telugu News