: మోడీకి సిబాల్ సవాల్


బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ సవాలు విసిరారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ చెప్పుకుంటున్నట్టు దేశమంతా ఆయనకు అనుకూల పవనాలు వీస్తుంటే, సురక్షితమైన లోక్ సభ స్థానం కోసం ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. నిజంగా మోడీకి సానుకూల పవనాలు బలంగా వీస్తుంటే మోడీ పోటీ చేసే స్థానాలకోసం వెతుకులాడాల్సిన అవసరం ఉందా? అని నిలదీశారు.

ముస్లింల మద్దతు తనకు ఉందని చెబుతున్న మోడీ అజాంఘర్ నుంచి పోటీ చేయగలరా? అని ఆయన సవాలు విసిరారు. కాగా మోడీ గుజరాత్ నుంచి, యూపీలోని వారణాసి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News