: విమానం కోసం హిందూ మహాసముద్రంపై గాలింపు చర్యలు
మలేసియా విమానం అదృశ్యంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. గత శనివారం కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళుతూ, టేకాఫ్ తీసుకున్న కొన్ని గంటలకే గ్రౌండ్ కంట్రోల్ తో ఈ విమానం సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మలేసియాతో అమెరికా, భారత్, చైనా సహా పలు దేశాలు ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నా ఫలితం శూన్యం. ఈ నేపథ్యంలో గాలింపు చర్యలను హిందూ మహాసముద్రానికి విస్తరించారు. దీనిపై అమెరికా వైట్ హౌస్ ప్రతినిధి జే కార్నీ మాట్లాడుతూ, కచ్చితమైన సమాచారం కాకున్నా, హిందూ మహాసముద్రం దిశగా విమానం ప్రయాణించిందన్న తాజా సమాచారం అందిందని, దాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉందని తెలిపారు.