: అక్బరుద్దీన్ కేసులో రెండో ముద్దాయికి అనారోగ్యం
అక్బరుద్దీన్ కేసులో రెండో ముద్దాయి అజీంబిన్ యాహియా తీవ్రఅనారోగ్యానికి గురవ్వడంతో పోలీసులు అజీంను ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ నిర్మల్ జైలులో ఉన్న అజీంబిన్ కు గుండెనొప్పి రావడంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనతో అజీంను హైదరాబాద్ కు తరలించారు.