: కేజ్రీవాల్ వ్యాఖ్యలను ఖండించిన బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్ మీడియాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్రాడ్ కాస్ట్ ఎడిటర్స్ అసోసియేషన్ ఖండించింది. ఈ రోజు నాగపూర్ లో ప్రసంగించిన కేజ్రీ కొన్ని మీడియా సంస్థలు పార్టీల చెప్పు చేతల్లో పని చేస్తున్నాయంటూ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే వారిని జైలుకు పంపుతామని కూడా హెచ్చరించారు.