: ధోనీ వచ్చాడు, జాగ్రత్తగా ఉండాలి: పాక్ జట్టుకు అఫ్రిది హెచ్చరిక


ఆసియా కప్ లో తాము గెలిచింది ధోనీ లేని భారత జట్టుపైనే అని, ఇప్పుడు టి20 వరల్డ్ కప్ లో అలాంటి విజయం నల్లేరుపై నడక కాదని పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది అభిప్రాయపడ్డాడు. ధోనీ మళ్ళీ జట్టులోకి వచ్చాడని, భారత్ తో మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అయితే, ఢాకాలో టీమిండియాపై సాధించిన విజయం తమకు ఉత్తేజాన్నిస్తుందనడంలో సందేహం లేదని చెప్పాడు. లాహోర్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, తాను గాయం నుంచి పూర్తిగా కోలుకున్నానని అఫ్రిది తెలిపాడు. రెండు వార్మప్ మ్యాచ్ లలో కనీసం ఒక్కటైనా ఆడతానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News