: బుజ్జాయికి ఎప్పుడు ఏ వ్యాక్సిన్ వేయించాలో... మెస్సేజ్ వస్తుందిక!


ఒకరు చెప్పకపోయినా తల్లిదండ్రులు తమ బిడ్డలను అపురూపంగా చూసుకుంటారు. ముఖ్యంగా రోజుల నుంచి వారికి నడక వచ్చే వరకూ అతి జాగ్రత్తగా చూసుకోవాలి. వారి ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయించాలి. ఆ విషయం మర్చిపోతే అది వారి భవిష్యత్తుపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో చిన్నారులకు ఎప్పుడు ఏ వ్యాక్సిన్ వేయించాలో గుర్తు చేసేలా మెసేజ్ అలర్ట్స్ సేవను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (చిన్న పిల్లల వైద్య నిపుణుల సంఘం) ప్రారంభించింది.

ఈ సేవలకు వొడాఫోన్ సహకారం అందిస్తోంది. 2018 నాటికి శిశు మరణాలను నివారించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సీకే మిశ్రా అన్నారు. ఈ మెసేజ్ అలర్ట్స్ సేవలు ఉచితంగా దేశవ్యాప్తంగా లభిస్తాయి. మొబైల్ నుంచి 566778 నంబర్ కు మెస్సేజ్ చేస్తే అక్కడి నుంచి కన్ఫర్మేషన్ వస్తుంది. 12 ఏళ్లపాటు ఎప్పుడు ఏ వ్యాక్సిన్ వేయించాలో సందేశాల రూపంలో గుర్తు చేస్తుంటుంది.

  • Loading...

More Telugu News