: యాదగిరిగుట్టలో వైభవంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు


ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో నారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. తెలంగాణ తిరుపతిగా పేరొందిన నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 11 రోజుల పాటు కోట్లాది భక్తుల హరినామస్మరణతో సాగిన బ్రహ్మోత్సవాలు... గురువారం శాంతగతాభిషేకం, డోలోత్సవం కార్యక్రమాలతో తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు స్వామి వారు వివిధ అలంకరణలతో, వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య వైభవంగా జరిగాయి.

ఉత్సవాల్లో భాగంగా 9వ తేదీన స్వామి వారికి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. 10న కల్యాణోత్సవం, 11న రథోత్సవం కార్యక్రమాలు జరిగాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సరిహద్దు జిల్లాలైన రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు హాజరై నారసింహుణ్ణి దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ ఛైర్మన్ నర్సింహమూర్తి, ఈవో కృష్ణవేణి పర్యవేక్షించారు.

  • Loading...

More Telugu News