: విజయనగరం జిల్లాలో దంపతుల దారుణహత్య
విజయనగరం జిల్లాలోని మక్కువ మండలం ఎస్.దొడ్డవలసలో దంపతులు దారుణహత్యకు గురయ్యారు. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిరువురిపై ఈరోజు (శుక్రవారం) ఆగంతుకులు ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.