: అహోబిలంలో కల్యాణ వైభోగం
కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారి కల్యాణం కనుల పండువగా జరిగింది. భక్తుల నర్సింహ నామస్మరణ నడుమ ఎదురుకోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అమృతవల్లి అమ్మవారి, ప్రహ్లాద వరదుడి గోత్ర నామధేయాలు చదువుతూ శాస్త్రోక్తంగా అర్చకులు కల్యాణోత్సవం నిర్వహించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం ఎగువ అహోబిలంలో గజవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.