: అమెరికా ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఫేస్ బుక్ అధినేత
ఇన్నాళ్లూ అమెరికా ప్రభుత్వ తీరుపై ఓపిక వహించిన ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకెర్ బర్గ్ ఒక్కసారిగా తన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తమ యూజర్ల సమాచారంపై జాతీయ దర్యాప్తు సంస్థ ద్వారా ఒబామా సర్కారు నిఘా వేస్తుండడంపై జుకెర్ బర్గ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 'అమెరికా ప్రభుత్వ తీరుతో నిరాశ, అయోమయానికి లోనయ్యా. యూజర్ల భద్రత కోసం మా ఇంజనీర్లు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తున్నారు. మిమ్మల్ని (ఫేస్ బుక్ యూజర్లు) సైబర్ నేరగాళ్ల బారి నుంచి రక్షిస్తున్నామని మేము భావిస్తున్నాం. కానీ, అమెరికా ప్రభుత్వం నుంచి కాదు' అంటూ జుకెర్ బర్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇంటర్నెట్ ప్రపంచంలో చాంపియన్ కావాలేగానీ, ముప్పుగా పరిణమించరాదని జుకెర్ బర్గ్ ఒబామా సర్కారు తీరును తప్పుబట్టారు.