: విమానాశ్రయాల్లో నేతల లగేజీ ఇక అణువణువూ తనిఖీ


ఇప్పటి వరకు నేతల లగేజీకి విమానాశ్రయాల్లో తనిఖీల నుంచి మినహాయింపు ఉండేది. కానీ ఎన్నికల సంఘం ఆదేశాలతో ఇకపై నేతల లగేజీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఇకపై ఈ నిబంధన అమలు కానుంది. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం అధికారి అనుగార్ గార్గ్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో నేతలు విదేశాల నుంచి నల్లధనాన్ని తీసుకువచ్చే అవకాశాలు ఉండడంతో ఈసీ ఈ చర్య తీసుకుంది.

  • Loading...

More Telugu News