: కాజల్ ఓటు రణబీర్ కే


షారూక్ ఖాన్ తో ఎన్నో సినిమాల్లో జోడీగా నటించిన సీనియర్ నటి కాజల్ ఎందుకో ఆయన నటనను మాత్రం అంతగా నచ్చలేకపోతోంది. కాఫీ విత్ కరణ్ జోహార్ కార్యక్రమంలో.. కరణ్ జోహార్ కాజల్ ను ఓ ప్రశ్న అడిగారు. షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ పేర్లను ఇచ్చి నటనలో ప్రతిభ ఆధారంగా వీరికి స్థానాలివ్వాలని అడిగాడు. దానికి కాజల్ తనవరకు రణబీరే నంబర్ 1 అని చెప్పేసింది. 'నిజానికి వీరిద్దరూ ఇంతవరకు కలసి నటించలేదు. రణబీర్ నటన అద్భుతం, ఆ తర్వాత షారూక్, అమీర్ సమ ఉజ్జీలుగా ఉంటారు. ఆ తర్వాత సల్మాన్' అని కాజల్ బదులిచ్చింది.

  • Loading...

More Telugu News