: పశ్చిమ గోదావరి జిల్లాలో నేడు జగన్ పర్యటన


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ముందు ఇక్కడి నుంచి విమానంలో గన్నవరం చేరుకుంటారు. అక్కడే కొద్దిసేపు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ నేతలతో మచ్చటిస్తారు. అప్పుడే కొంతమంది జగన్ సమక్షంలో పార్టీలో చేరతారు. వెంటనే రోడ్డు మార్గంలో నరసాపురం వెళతారు. సాయంత్రం నిర్వహించే వైఎస్సార్సీపీ జనభేరి కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. ఇక్కడ నరసాపురం కాంగ్రెస్ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైఎస్సార్సీపీలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News