: భారత క్రికెట్ జట్టుకు 1,75,000 అమెరికన్ డాలర్ల చెక్కు


అంతర్జాతీయంగా భారత క్రికెట్ జట్టు తన హవాను చాటుకుంటోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్ లోనూ టీం ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఫలితంగా భారత జట్టు షీల్డ్ తో పాటు 1,75,000 అమెరికన్ డాలర్ల నగదు అందుకోబోతోంది.
 
ఐసీసీ తాజాగా వెల్లడించిన ర్యాంకింగ్స్ ప్రకారం 119 పాయింట్లతో ఇండియా ప్రథమ స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ 117 పాయింట్లతో రెండో స్థానంలోనూ, ఆస్ట్రేలియా 116 పాయింట్లతో మూడోస్థానంలోనూ ఉన్నాయి.
 
ఇక ఆటగాళ్ల విషయానికొస్తే,  భారత ఆటగాళ్లలో 812 పాయింట్లతో విరాట్ కోహ్లీ మూడో స్థానం, 784 పాయింట్లతో ధోని నాల్గొవ స్థానం సంపాదించారు.   

  • Loading...

More Telugu News