: ఆదివారం 'జీ తెలుగు'లో కనువిందు చేయనున్న 'రామయ్యా వస్తావయ్యా'
జూనియర్ ఎన్టీఆర్, శృతిహాసన్, సమంత కాంబినేషన్లో తెరకెక్కిన 'రామయ్యా వస్తావయ్యా' ప్రీమియర్ ఈ నెల 16న జీ తెలుగు టీవీలో ప్రసారం కానుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా ఆరంభం అవుతుంది. హిట్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాకు దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఎన్టీఆర్ ఈ చిత్రంలో లవర్ బోయ్ గా అలరించగా, శృతి, సమంత ప్రాధాన్యమున్న పాత్రలు పోషించడం విశేషం.