: భూమి అంతర్భాగంలో సీక్రెట్ రిజర్వాయర్...!
నూట యాభై ఏళ్ళ క్రితం ఫ్రెంచ్ రచయిత జూల్స్ వెర్నే తాను రాసిన సైంటిఫిక్ థ్రిల్లర్ 'జర్నీ టు ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్'లో భూమి లోపల కూడా సముద్రం ఉందని పేర్కొంటాడు. ఆ పుస్తకం అదే పేరుతో ఇటీవల సినిమాగానూ వచ్చింది. కాగా, భూమిలోపల భారీ జలాశయం ఆనవాళ్ళున్నట్టు తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వివరాలను కెనడాలోని ఆల్బెర్టా యూనివర్శిటీకి చెందిన గ్రాహమ్ పియర్సన్ తెలిపారు. ఆయన ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు.
ఈ సీక్రెట్ రిజర్వాయర్ భూమికి 400-600 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించామని, భూమిపై ఉన్న మహాసముద్రాలను కలిపితే ఎంత నీటి పరిమాణం ఏర్పడుతుందో ఈ రహస్య జలాశయం అంత పరిమాణంలో ఉంటుందని తాము విశ్వసిస్తున్నట్టు పియర్సన్ పేర్కొన్నారు.