: గంటాను గాయపరిచిన 'చింతకాయల' మాటలివే


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాక్షిగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకున్న నలుగురు ఎమ్మెల్యేలపై ఆ పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 'ఇవాళ టీడీపీలోకి కొంత మంది వచ్చారు. వారు ఎంతకాలం ఉంటారో, ఎప్పుడు పోతారో తెలియదు. మేం మాత్రం పార్టీలోనే కొనసాగుతాం. కొత్తగా వచ్చిన నేతలు ఇకనైనా బుద్ధిగా పనిచేస్తే పార్టీకి మంచిది' అని గంటా, కన్నబాబు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, చింతలపూడి వెంకట్రామయ్యలను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు చేశారు.

దీంతో, వీరంతా మనస్తాపం చెంది గంటా నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు, అయ్యన్నపాత్రుడికి మనస్పర్థలు ఉన్నాయని గంటా అంగీకరించారు. సమస్యలున్నా తాను టీడీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. గంటా గతంలో టీడీపీలో పనిచేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News