: బొత్సకు అన్యాయం జరిగిందంటూ తణుకు ఎమ్మెల్యే రాజీనామా
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుండా బొత్స సత్యనారాయణకు అన్యాయం చేశారని తణుకు ఎమ్మెల్యే కె.నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి బొత్స అండగా నిలబడ్డారని... అయినా, కాంగ్రెస్ అధిష్ఠానం బొత్సకు తీరని అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.