: మద్దతు ధర తీసుకొస్తా: జయదేవ్
పత్తి, పసుపు, పొగాకును ఉత్తత్తి చేయడంలో గుంటూరు రైతులది అందెవేసిన చేయి అని టీడీపీ నేత గల్లా జయదేవ్ అన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, తనను ఆదరించిన టీడీపీ కార్యకర్తలకు, నందమూరి, కృష్ణ, మహేష్ బాబు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. గుంటూరు లోక్ సభ స్థానానికి సంబంధించిన అంశాలతో మేనిఫెస్టో తయారు చేశానని చెప్పారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర తీసుకొస్తానని గల్లా జయదేవ్ వివరించారు.