: హోలీ పండుగ వేళ జంటనగరాల్లో ఆంక్షలు
రంగుల పండుగ హోలీ సందర్భంగా జంటనగరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు నగరపోలీస్ కమిషనర్లు అనురాగ్ శర్మ, తిరుమలరావు తెలిపారు. రేపు సాయంత్రం ఆరు గంటలనుంచి 28 వతేదీ ఉదయం ఆరు గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వారు వెల్లడించారు.
ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో మద్యం దుకాణాలు, బార్లు మూసి వేయాలని ఆయా వ్యాపారసంస్థల యజమానులకు విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగేలా రంగులు చల్లు కోకూడదని కూడా పోలీస్ కమిషనర్లు స్ఫష్టం చేశారు.