: నటుడు సైఫ్ అలీ ఖాన్ పై అభియోగాలు


దక్షిణాఫ్రికాకు చెందిన ఇక్బాల్ శర్మ అనే వ్యాపారవేత్తపై దాడి చేసిన కేసులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై తాజాగా అభియోగాలు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్ 325 (తీవ్ర గాయాలయ్యేందుకు కారణం) కింద, సెక్షన్ 34 కింద ముంబై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో ఏప్రిల్ 30 నుంచి కోర్టు విచారణ చేపట్టనుంది. 2012లో ముంబైలోని తాజ్ హోటల్లో కరీనా, పలువురు స్నేహితులతో వచ్చిన సైఫ్ వ్యాపార వేత్త ఇక్బాల్, అతని అనుచరులపై దాడి చేశాడు. ఈ సమయంలో వ్యాపారవేత్త ముక్కు వెంట రక్తం కూడా వచ్చింది. దాంతో, అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News