: జనసేన పార్టీ నాదే: బాలరాజు
పవన్ కల్యాణ్ స్థాపించాలనుకుంటున్న జనసేన పార్టీకి కష్టాలు మొదలయినట్టు కనిపిస్తోంది. పార్టీ పేరుకు సంబంధించి లొల్లి మొదలైంది. జనసేన పార్టీ తనదని బాలరాజు అనే వ్యక్తి చెబుతున్నారు. ఆరు నెలల క్రితమే జనశక్తి పేరుతో పార్టీ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకున్నానని తెలిపారు. సామాజిక తెలంగాణ కోసం జనసేన పార్టీని స్థాపించేందుకు కృషి చేస్తున్నానని స్పష్టం చేశారు. వవన్ కల్యాణ్ తాను పెట్టబోయే పార్టీ పేరును మార్చుకోవాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు.