: ఎన్నికల వాయిదాపై పార్టీలతో ఈసీ భేటీ
రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ అయింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా అంశంపై పార్టీలతో ఈసీ చర్చిస్తోంది. ఈ సమావేశానికి కమలాకర్ రావు (కాంగ్రెస్), ఇంద్రసేనారెడ్డి(బీజేపీ), నారాయణ(సీపీఐ), మండవ వెంకటేశ్వరరావు (టీడీపీ), శ్రీనివాసరెడ్డి (టీఆర్ఎస్), మైసూరారెడ్డి (వైఎస్సార్సీపీ) హాజరయ్యారు. ఎన్నికలు వాయిదా వేయాలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.